TS Dsc SGT Maths Content in Telugu|| Basics In Maths
ts Dsc sgt maths content in Telugu
3 వ తరగతి
- 3 అగ్గిపుల్లలతో – త్రిభుజం ఏర్పడుతుంది
- 4 అగ్గి పుల్లలతో – చతురస్రం ఏర్పడుతుంది
- 8 అగ్గి పుల్లలతో – దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది
- 5 అగ్గిపుల్లలతో – త్రిభుజం ఏర్పడుతుంది
- 12 అగ్గి పుల్లలతో – దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది
- 0, 1 ,2 ,3, 4, 5, 6, 7, 8, 9 లను అంకెలు అంటారు, అంకెలతో సంఖ్యలు ఏర్పడుతాయి
- చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు రాయడాన్ని “ఆరోహణ క్రమం “ అంటారు
ఉదా: 1, 2, 3, 4, 5
- పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు రాయడాన్ని “ఆవరోహణ క్రమం “ అంటారు
ఉదా: 5, 4, 3, 2,1
- అంకెల్లో – ‘0’ చిన్నది మరియు ‘9’ పెద్దది
- సంఖ్యలలో – 10 చిన్నది , పెద్దది చెప్పలేము
- రెండంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 10
- రెండంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య 99
- మూడంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య 100
- మూడంకెల సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య 999
- ఒక అంకె కు ఎడమ వైపున 0 ఉంటే , 0 కు విలువ ఉండదు
- 125 = 1 × 100 + 2 × 10 + 5 × 1 = 100 + 20 + 5
దీనిని 125 యొక్క “విస్తరణ రూపం” అంటారు
- పెద్దది (ఎక్కువ) ⟶ > (greater than)
- చిన్నది (తక్కువ) ⟶ < (less than )
- సమానపు గుర్తు ⟶ =
- కూడిక ⟶ సంకలనం (మొత్తం) : ⟶ +
- తీసివేత ⟶ వ్యవకలనం (భేదం ) : ⟶ –
- కూడిక, తీసివేత ఓకే దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి
- ఏవైన రెండు సంఖ్యల మొత్తం, ఆ రెండు సంఖ్యల కన్నా పెద్దది
- ఎవైన రెండు సంఖ్యల భేదం , ఆ రెండు సంఖ్యల కన్నా చిన్నది
- పదే పదే సంఖ్యలను కూడగా వచ్చేది గుణకారం
- ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించినా వచ్చేవి గుణిజాలు
- సున్నా తో ఏ సంఖ్య చే గుణించినా సున్నానే వస్తుంది
- ఒకటి తో ఏ సంఖ్య చే గుణిస్తామో అదే సంఖ్య వస్తుంది
- గుణ్యం × గుణకం = లబ్దం
- భాగహారం అంటే “సమాన భాగాలుగా విభజించడం”
- 32 ÷ 4 = 8
32 – విభాజ్యం ; 4 – భాజకం ;8 – భాగఫలం ; 0 – శేషం
- విభాజ్యం = భాజకం× భాగఫలం + శేషం
- గుణకారానికి , భాగాహారానికి మంచి సంబంధం ఉంది
- ప్రతి గుణకార రూపాన్ని భాగహార రూపంగా చూపవచ్చు
- ప్రతి భాగహార రూపాన్ని గుణకార రూపంగా చూపవచ్చు
- ఒకే విధమైన సాధనం తో కొలిస్తే కొలతలో ఎలాంటి తేడా ఉండదు
- స్కేలు , టేపు వంటి సాధనాలతో పొడవులను కొలుస్తాము
- పొడవును సెంటిమీటర్లు , అంగులాలలో కొలుచుటకు స్కేలును ఉపయోగిస్తాము
- పొడవుకు ప్రమాణం “మీటర్”
- బరురువుకు ప్రమాణం “గ్రాము”
- ద్రవానికి ప్రమాణం “లీటర్”
- ఒక పాత్రలో ద్రవం యొక్క గరిష్ఠ పరిమాణాన్ని ఆ పాత్ర యొక్క సామాత్యం అంటారు
- గాదియారం లో చిన్న ముల్లును ను గంటల ముల్లు అంటారు , పెద్ద ముల్లును నిమిషాల ముల్లు అంటారు
- కాలం కు ప్రమాణం “సెకన్”
- ఒక రోజుకి 24 గంటలు
- ఒక వారం కి 7 రోజులు
- ఒక సంవత్సరానికి 12 నెలలు