తెలుగు భావనలు – వ్యాకరణం
తెలుగు భావనలు
వ్యాకరణ సంగ్రహం
మన మనస్సు లోని భావాలను , అనుభూతులను పైకి చెప్పడానికి మాతృభాష ఎంతో ఉపయోగం , అందుకే మాతృ భాష తల్లి లాంటిది అంటారు. మనం మన మాతృ భాషని గౌరవించాలి .
గ్రహణ సామర్థ్యం పెరగడానికి మాతృ భాష లో విద్యా బోధన ఎంతగానో ఉపయోగ పడుతుంది. మాతృ భాష లో బోధించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది.
మన మాతృ భాష తెలుగు . తెలుగు భాష పట్ల అంకిత భావం కలిగి ఉండాలి .
వర్ణమాల
భాషా ధ్వనులకు అక్షరపు గుర్తులను ‘ వర్ణమాల’ లేదా ‘ అక్షరామాల’ అని అంటారు.
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ
ఎ ఏ ఐ ఓ ఔ అం ఆః
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ
శ ష స హ ళ క్ష ఱ
అక్షరాలను మూడు రకాలుగా విభజించారు. అవి: 1. అచ్చులు. 2. హల్లులు 3. ఉభయాక్షరాలు
1. అచ్చులు:
ఆచ్చులు మొత్తం 14 అక్షరాలు. అవి :
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ |
ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ |
అచ్చులకు ‘ప్రాణములు’ మరియు ‘ స్వరములు’ అనే పేర్లు ఉన్నాయి.
2. హల్లులు:
హల్లులు మొత్తం 35 అక్షరాలు. అవి :
క | ఖ | గ | ఘ | ఙ |
చ | ఛ | జ | ఝ | ఞ |
ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న |
ప | ఫ | బ | భ | మ |
మ | య | ల | వ | శ |
ష | స | హ | ళ | ఱ |
హల్లులకు ‘వ్యంజనములు ‘ మరియు ‘ప్రాణులు’ అనే పేర్లున్నాయి.
3. ఉభయాక్షరాలు : ఈ అక్షరాలను అచ్చులలోను,హల్లులలోను కూడా ఉపయోగిస్తారు.
ఇవి మూడు :1. ఁ 2. ం 3. ః
వచనాలు:
వచనాలు రెండు రకాలు అవి: 1. ఏక వచనం 2. బహువచనం
1, ఏకవచనం: – ఒకే వస్తువును తెలియజేసే దానిని ఏకవచనం అంటారు .
ఉదా : – బాలుడు , బాలిక , చెట్టు, మొదలగునవి.
2. బహువచనం : – ఒకటికంటే ఎక్కువ వస్తువులను తెలియజేసే దానిని బహువచనం అంటారు.
ఉదా : – బాలురు , బాలికలు , చెట్లు , మొదలగునవి.
గుణింతాలు :
తెలుగు భావనలు
భాషా భాగాలు
భాషకు ప్రాణం భావ ప్రసరణ . ఈ భావ ప్రసరణ ఒకరి నుండి మరొకరికి చేరాలి . ఇలా చేరడానికి కొన్ని పదాలు వాక్యాలు అవసరం. కొన్ని అక్షరాలతో పదాలు ఏర్పడతాయి, కొన్ని పదాలతో వాక్యాలు ఏర్పడతాయి. పదాలు కొన్ని భాగాలుగా విభజించ బడ్డాయి. ఈ భాగాలనే ‘భాషాభాగాలు’ అంటారు. ఇవి ఐదు రకాలు అవి : 1) నామవాచకం 2) సర్వనామం 3) విశేషణం 4) క్రియ 5) అవ్యయం .
1.నామవాచకం: పేర్లను తెలియజేసే నామవాచకాలు అంటారు.
ఉదా: – రాముడు, సీత, చిలుక , బల్ల మొ∥ నవి.
2.సర్వనామాలు : నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు
ఉదా: – అతడు, ఆమె , అది , ఇది మొ∥ నవి.
3.విశేషణం : నామ వాచకం యొక్క కానీ , సర్వనామం ఒక్క కానీ గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు.
ఉదా: – ఎర్రగా , పెద్దగా , తెర్లగా , మంచి మొ∥ నవి.
ఆ పాలు వేడిగా ఉన్నాయి
4.క్రియ: పనులను స్థితిగతులను తెలియజేసే ది క్రియ
ఉదా: – వెళ్తున్నారు,వస్తున్నాడు , పాడుతున్నాడు మొ∥ నవి.
5.అవ్యయం : లింగ, వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను వ్యయాలు అంటారు.
ఉదా: అక్కడ, ఇక్కడ, ఆహ మొ∥ నవి.
మరిన్ని విషయాలకు ఇక్కడ నొక్కండి
తెలుగు భావనలు
Visit my YouTube channel: Click on the Logo