10 వ తరగతి గణితం నోట్స్ 10 వ తరగతి గణితం 10 వ తరగతి గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అంటే, పిల్లలు తమ స్వంత అభ్యాసానికి బాధ్యత వహిస్తారు మరియు సమస్యలను పరిష్కరించడానికి భావనలను వర్తింపజేయడం నేర్చుకుంటారు. ఈ విషయం . ఈ గమనికలు విద్యార్థులకు గణితంను ఇస్టపడేలా మరియు భయాన్ని అధిగమించడానికి సహాయపడతాయి. 1. వాస్తవ సంఖ్యలు మనం ముందు తరగతులలో వివిధ రకాలైన సంఖ్యలను గురించి తెలుసుకున్నాము .అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కరణీయ , అకరణీయ సంఖ్యలను గురించి నేర్చుకున్నాము . అకరణీయ సంఖ్యలు : p,q లు పూర్ణ సంఖ్య లై , q ≠ 0 అయిన సందర్భం లో రూపం లో రాయగల సంఖ్య లను అకరణీయ సంఖ్యలు అంటారు . దీనిని Q తో సూచిస్తారు . ఉదా :- మొదలగునవి. కరణీయ సంఖ్యలు : రూపం లో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు . దీనిని QI లేదా S తో సూచిస్తారు . ఉదా :- మొదలగునవి. వాస్తవ సంఖ్యలు : అకరణీయ , కరణీయ సంఖ్యల సమూహాన్ని వాస్తవ సంఖ్యలు అంటారు . కింది పటములో మనం వీటిని చూడ వచ్చు. భాగహార శేష నిధి : a, b అనే ధన పూర్ణాంకాలు ఇచ్చినప్పుడు a = b q + r, 0≤ r <b అయ్యే విధంగా ఏకైక జత పూర్ణాంకాలు q ,r లు వ్యవస్తితం అవుతాయి. ఇది అందరికి తెలిసినప్పటికీ యూక్లిడ్ పుస్తకాల సంకలనం లోని 7 వ పుస్తకం లో మొట్టమొదటగా నమోదు చేయడం జరిగింది. ఈ భాగహార శేషనిధి మీద యూక్లిడ్ భాగహార శేష నిధి ఆధారపడి ఉంది. యూక్లిడ్ భాగహార శేషనిధి కేవలం ధన పూర్ణ సంఖ్యల పైనే నిర్వచించ బడినా , దానిని అన్ని శూన్యేతర పూర్ణ సంఖ్యలకు అనువర్తింప చేయవచ్చు . యూక్లిడ్ భాగహార శేషనిధి ఉపయోగించి గ . సా . భా ను కనుక్కోవడం : రెండు ధన పూర్ణ సంఖ్యల సామాన్య కారాణాంకాలలోని అతి పెద్ద కారణాo న్కాన్ని గ .సా. భా అంటారు . ఉదా:- 9 , 24 ల గ . సా .భా కనుక్కోవడం దీనిని 24 = 9×2 + 18 గా రాయవచ్చు 9 , 24 కన్నా పెద్దది కావున 24 ను 9 చే భాగిస్తే శేషం 6 వస్తుంది పై దానిలో ని భాజకం 9 మరియు 6 పై యూక్లిడ్ న్యాయాన్ని అనువర్తింప చేయగా 9 = 6 ×1 + 3 గా రాయవచ్చు పై దానిలో ని భాజకం 6 మరియు శేషం 3 పై యూక్లిడ్ న్యాయాన్ని అనువర్తింప చేయగా దానిని 6 = 3 ×2 + 0 గా రాయవచ్చు పై దాని లో శేషం సున్నా వచ్చింది కావున 9 , 24 ల గ . సా .భా 3 అవుతుంది. ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం : ప్రతి సంయుక్త సఖ్యను ప్రదానానంకముల లబ్దంగా రాయవచ్చు మరియు ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్దం ఏకైకం . ఒక సంయుక్త సంఖ్య x ను x = p 1 p 2 ….p n అని రాయవచ్చు . దీనిలో p 1 , p 2, …., p n ఆరోహణ క్రమం లో రాయబడిన ప్రధానాంకాలు , అంటే p 1≤ p 2 ≤….≤ p n. ఈ సందర్భం లో ఒకే రకమైన ప్రదానంకములు వాడినచో వాటిని ప్రధానాంకాల ఘా తాoకాలుగా రాస్తాము . ఒకసారి మనం ఈ సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్నాయని భావిస్తే . అప్పుడు లబ్దం ఏకైకం . ఉదా :- 360 = 3×3×2× 2 × 2 × 5 = 32 × 23 × 5 ప్రధాన కారణాంకాల లబ్ద పద్ధతి ద్వారా గా. సా . భా మరియు కా . సా . గు కనుక్కోవడం; 9 , 24 ల గ . సా .భా మరియు కా. సా . గు. కనుక్కోవడం 9 యొక్క ప్రధాన కారణాంకాలు = 3 × 3 = 32 24 యొక్క ప్రధాన కారణాంకాలు = 2 × 2 ×2 × 3 = 23 ×31 9 , 24 ల గ . సా .భా = 31 = 3 ( సంక్యల యొక్క సామాన్య కారణాంకంల కనిష్ఠ ఘాతాల లబ్ధం ) 9 , 24 ల కా. సా . గు.= 32× 23 = 9×8 = 72 (సంఖ్యల యొక్క కారణాంకంల గరిష్ఠ ఘాతాల లబ్ధం) అకరణీయ సంఖ్యలు మరియు వాటి దశాంశ రూపాలు : x అనేది ఒక అకరణీయ సంఖ్య మరియు దీని ధశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశము ,అయినప్పుడు x ను p, q లు పరస్పర ప్రధా నాంకములు అయివున్న p /q రూపం లో వ్యక్త పరచవచ్చు . మరియు q యొక్క ప్రధాన కారాణాంకాల లబ్దం 2m 5 n అగును , n ,m లు ఋణేతర పూర్ణ సంఖ్యలు . పై దాని విపర్యయం ఇలా ఉంటెుంది • n ,m లు ఋణేతర పూర్ణ సంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారాణాంకాల లబ్దం 2m 5 n కలిగినటువంటి అకరణీయ సంఖ్య x = p /q అయిన, xయొక్క ధశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశము అగును , • n ,m లు ఋణేతర పూర్ణ సంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారాణాంకాల లబ్దం 2m 5 n రూపంలో లేకుంటే , అకరణీయ సంఖ్య x = p /q అయిన, xయొక్క ధశాంశ రూపం ఒక అంతంకాని దశాంశము అగును. ఉదా :- కరణీయ సంఖ్యలు :- • p, q లు కరణీయ సంఖ్యలు మరయు q ≠ 0 అయిన p /q రూపం లో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు . • ప్రతీ కరణీయ సంఖ్య ధశాంశ రూపం ఒక అంతంకాని దశాంశము అగును. ప్రవచనం: p అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు a ఒక ధనపూర్ణ సంఖ్య అయితే “ a2 ను p నిశ్శేషంగా భాగిస్తే a ను p నిశ్శేషంగాభాగిస్తుంది. ఘాతాలు : • a n ను ఘాతాంక రూపం అంటాము. a ను భూమి అని , n ను ఘాతము అని అంటారు. (i) (ii) (iii) ( am)n = amn (iv) a0 = 1 సంవర్గమానాలు:- x మరియు aలు ధనపూర్ణసంఖ్యలై a ≠1 అయివుండి ax = n అయిన x = అగును. 2. సమితులు • గణిత పరిశోధనలలో సమితి వాదాన్ని ‘ జార్జి కాంటర్’ అభివృద్ధి పరిచారు. సమితి: సునిర్విచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. • సునిర్విచితం అనగా : 1 . సమితిలోని వస్తువులన్నిటికి ఒకే విధమైన సామాన్య పోలిక లేదా ధర్మం కలిగి ఉండాలి . 2 . ఏదైనా ఓకే సమితికి చెందినది, లేనిది నిర్దారించే టట్లు ఉండాలి. • సమితి పేరును ఇంగ్లీష్ వర్ణమాల లోని పెద్ద అక్షరాలతో సూచిస్తారు. ఉదాహరణకు A, B, … మొదలగునవి. • ఏదైనా ఓకే వస్తువు ఒక సమితికి చెందితే దాన్ని వస్తువులు/ మూలకాలు అంటారు . చెందినది (belongs to) అని తెలపటానికి మనం ∈ గుర్తు తో సూచిస్తాము.సమితికి చెందినది అయితే దానిని ∉ చే సూచిస్తాము. • జాబితా రూపం లేదా రోస్టర్ రూపం : సమితికి చెందిన మూలకాలన్నిటిని ‘కామ’ (,) తో వేరు చేసి ప్లవర్ బ్రాకెట్ { } లో ఉంచితే వచ్చే రూపాన్ని జాబితా రూపం లేదా రోస్టర్ రూపం అంటారు. ఉదా :- A = {1, 2, 3, 4}, B = { a, e, I, o, u}. • సమితి నిర్మాణ రూపం లేదా లాక్షణిక రూపం : సమితి లోని మూలకాన్ని x ( లేక y, z మొదలగు ఏవైన గుర్తులు ) గా సూచించి , x ప్రక్కన : లేదా / (colon ) ఉంచి ఆ సమితి కి చెందిన మూలకాల యొక్క లక్షణాలు లేదా ధర్మాలను రాసి ప్లవర్ బ్రాకెట్ { } ఉంచితే వచ్చే రూపాన్ని సమితి నిర్మాణ రూపం లేదా లాక్షణిక రూపం అంటారు . : లేదా / గుర్తులను such that అని చదువుతాము . ఉదా :- A = { x/ x ఒక సరి సంఖ్య మరియి x ∈N }, B = { y : y ఒక ప్రధాన సంఖ్య మరియు x < 10 }. సమితులు – రకాలు