Telugu Grammer( తెలుగు వ్యాకరణం )
Telugu Grammer( తెలుగు వ్యాకరణం ) Telugu Grammer( తెలుగు వ్యాకరణం ): మన మనస్సు లోని భావాలను , అనుభూతులను పైకి చెప్పడానికి మాతృభాష ఎంతో ఉపయోగం , అందుకే మాతృ భాష తల్లి లాంటిది అంటారు. మనం మన మాతృ భాషని గౌరవించాలి . గ్రహణ సామర్థ్యం పెరగడానికి మాతృ భాష లో విద్యా బోధన ఎంతగానో ఉపయోగ పడుతుంది. మాతృ భాష లో బోధించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. భాషా భాగాలు : భాషకు ప్రాణం భావ ప్రసరణ . ఈ భావ ప్రసరణ ఒకరి నుండి మరొకరికి చేరాలి . ఇలా చేరడానికి కొన్ని పదాలు వాక్యాలు అవసరం. ఇలా వాక్యం లోని ఉపయోగాన్ని బట్టి భాషకు ఐదు ప్రధాన భాగాలుగా విభజించారు. అవి :− 1. నామవాచకం 2. సర్వనామం 3. విశేషణం 4. క్రియ 5. అవ్యయము 1.నామవాచకం : నామము అనగా పేరు.ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని ,గుణమును గాని, జాతిని గాని తెలుపును. ఉదా :- ధర్మరాజు , హైదరాబాద్ , బంతిపువ్వు , ఆవు మొ|| నవి . 2. సర్వనామము : నామ వాచకాలకు బదులుగా వాడే వాటిని “ సర్వనామాలు “ అంటారు. “సర్వ” అనగా సమస్తము. ఉదా :- అది, ఇది, అతడు , ఆమె ,అన్ని ,కొన్ని మొ|| నవి. 3. విశేషణం : నామవాచకము మరియు సర్వనామముల యొక్క గుణమును తెలియజేయునది . ఉదా :- మంచి , చెడు , లావు , పొట్టి , పొడుగు , ఎత్తు మొ|| నవి. 4. క్రియ : పనులను, స్తితిగతులను తెలియజేయునది . ఉదా :- రాస్తున్నాడు , వెళ్తున్నాడు , పాడుతున్నాడు మొ|| నవి. 5. అవ్యయము : వ్యయము అనగా నశించేది, అవయము అనగా నశించనిది . లింగ, వచన, విభక్తుల ప్రసక్తిగాని, వచన ఆకాంక్ష లేని వాటిని అవ్యయములు అంటారు . ఉదా :- అక్కడ, ఇక్కడ, ఆహా , భళా మొ|| నవి. సంధులు ∗ వ్యాకరణ భాషలో రెండు స్వరాల కలయికను సంధి అంటారు . ∗ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును సంధి కార్యం అంటారు. ∗ సంధి జరిగే మొదటి పదo చివరి అక్షరం లోని అచ్చును ‘పూర్వ పదం’ అంటారు . ∗ సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరం లోని అచ్చును ‘పర పదం ‘ అంటారు . ఉదా :- రామ + అయ్యా: ‘ రామ’ లోని ‘మ’ లో ‘అ’ పూర్వ పదం ‘అయ్యా’ లోని ‘అ ‘ పర పదం . అత్వ సంధి(అకార సంధి ): అత్తునకు సంధి బహుళంగా వస్తుంది . ఉదా :-1) మేఅల్లుడు = మేన + అల్లుడు 2) లేకేమి = లేక + ఏమి 3) రాకుంటే = రాక + ఉంటే 4) పోవుటెట్లు = పోవుట + ఎట్లు ఇత్వ సంధి ( ఇకార సంధి): ఏమ్యాదులకు ఇత్తునకు సంధి . ఉదా :- 1) ఏమంటివి = ఏమి + అంటివి 2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు 3) వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు 4) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు ఉత్వ సంధి ( ఉకార సంధి ): ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది . ఉదా :- 1) రాముడతడు = రాముడు + అతడు 2) మనమున్నాము = మనము + ఉన్నాము 3) అతడెక్కడ = అతడు + ఎక్కడ 4) మనసైన = మనసు + ఐన యదగామ సంధి : అంది లేని చోట అచ్చుల మద్య ‘య్’ వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు . ఉదా :- 1) మాయమ్మ = మా + అమ్మ 2) హరియతడు = హరి + అతడు 3) మాయిల్లు = మా + ఇల్లు ఆమ్రేడిత సంధి : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది . ఉదా :- 1) ఆహాహా = ఆహా +ఆహా 2) ఔరౌర = ఔర + ఔర 3) అరెరే = అరె + అరె 4) ఏమిటేమిటి = ఏమిటి + ఏమిటి గసడదవాదేశ సంధి : ప్రథమ మీది పరుషాలకు గ, స ,డ , ద ,వ లు బహుళంగా వస్తాయి . ఉదా :- 1) కొలువుసేసి = కొలువు + చేసి 2) కూరగాయలు = కూర + కాయ 3) పాలువోయక = ఆలు + పోయక 4) తల్లిదండ్రులు = తల్లి + తండ్రి త్రిక సంధి : త్రికము మీది అసంయుక్త హల్లునకు దిత్వం బహుళంగా వస్తుంది . ఆ , ఈ , ఏ లు త్రికంఅనబడుతాయి ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు, అచ్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. ఉదా :- 1) ఇక్కాలము = ఈ + కాలము 2) అక్కోమరుండు = ఆ + కొమరుండు 3) ఎవ్వాడు = ఏ + వాడు 4) అచ్చోట = ఆ + చోట రుగాగమ సంధి : పేదాది శబ్దాలకు ‘ఆల‘ శబ్దo పరమైతే కర్మదారాయం లో రుగాగం వస్తుంది . ఉదా :- 1) మనుమరాలు = మనుమా + ఆలు 2) ధీరురాలు = దీరు + ఆలు. 3) పేదరాలు = పేద + ఆలు 4) బాలెంతరాలు = బాలెంత + ఆలు 5 ) ముద్దరాలు = ముద్ద +ఆలు 6) జవరాలు = జావా + ఆలు సవర్ణ దీర్ఘ సంధి: అ, ఇ , ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాని దీర్గాలు ఎకాదేశంగా వస్తాయి . ఉదా :- 1) రామానుజుడు = రామ + అనుజుడు 2 ) రామాలయం = రామ + ఆలయం. 3) భానూఉదయం = భాను + ఉదయం 4) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు. 5 ) పితౄణం = పితృ +ఋణం 6) వదూపేతుడు = వధు + ఉపేతుడు గుణసంధి : ఇ , ఉ , ఋ పరమైతే ఏ, ఓ , ఆర్ లు క్రమంగా ఎకాదేసంగా వస్తాయి . ఉదా :- 1) రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు 2 ) పరోపకారం = పర + ఉపకారం 3) రాజర్షి = రాజ + ఋషి 4)

